Sunday, 28 August 2016

రాయలసీమ సమగ్రాబివృద్దికి గుంతకల్లుకు రైల్వే జోన్, తిరుపతి బాలాజీ డివిజన్ కీలక అవసరం.

రాయలసీమ సమగ్రాబివృద్దికి గుంతకల్లుకు రైల్వే జోన్, తిరుపతి బాలాజీ డివిజన్ కీలక అవసరం.
వెనుకబడిన రాయలసీమ సమగ్రాబివృద్దికి మౌళికవసతుల కల్పన అత్యంత కీలకం. అందులో ముఖ్యమైనది రవాణా సౌకర్యాలూ అందులోను రైల్వేలు ప్రదాన మైనవి. భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ పాలనా అవసరాల కోసం నిర్మించిన రైల్వేలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. విబజన ద్వారా నష్ట పోయిన ఏపికి కేంద్రం ఇచ్చిన హమీలపై నేడు రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. కేంద్రం కూడా విబజన చట్టం పరిదిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపద్యంలో రైల్వేజోన్ ను సీమలోని గుంతకల్లుకు, డివిజన్ తిరుపతికి సాదించు కోవడం రాయలసీమ ప్రజల ముందు ఉన్న కర్తవ్యం.
రైల్వే జోన్ గా గుంతకల్లు, డివిజన్ గా తిరుపతి అత్యంత అనువైన ప్రాంతాలు......
రాయలసీమలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం. ఆంగ్లేయుల కాలంలోనే చెన్నై-ముంబైయ్, బెంగళూరు-సికిందరాబాదు, తిరుపతి-నాగపూర్, గుంటూరు-హుబ్లీ లను అనుసందానం చేయడానికి అనువైన కేంద్రం గుంతకల్లు అని బావించి 1927 లోనే గుంతకల్లును రైల్వే డివిజన్ గా ప్రకటించారు.1400 కీ మీ పరిది, 130 రైల్లు, రోజూ లక్ష మంది ప్రయానికులు, ఏటా 11 వందల కోట్ల ఆదాయం కలిగిన డివిజన్ మన గుంతకల్లు. అంతేకాదు బెంగుళూరుకు 300 కి మీ, చెన్నైకి 450 కి మీ, హైదరాబాదుకు 300 కి మీ, రాజదాని అమరావతికి 300 కి మీ, హుబ్లీ కి 260 కి మీ దూరం కలిగి అన్ని ప్రదాన నగరాలకు అత్యంత అనువైన ప్రాంతం గుంతకల్లు. రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి తగిన భూమి కలిగిన ప్రాంతం. అది ఎంతగా అంటే గుంతకల్లు మున్సిపాలిటి ఎంత విస్తీర్ణంలో ఉందో దాదాపు అంత స్దలం స్వయంగా రైల్వేకి ఉంది. ఎటువంటి ప్రకృతి విపత్తులకు ఆస్కారంలేని ప్రాంతం. కనుక జోన్ ఏర్పాటుకు 100 శాతం అర్హత కలిగిన ప్రాంతం మన గుంతకల్లు. అదే విదంగా రోజుకు సగటున 50 వేల మంది ప్రయానికులతో, సికిందరాబాదు తర్వాత ఎక్కువ ఆదాయం కలిగి రాష్ట్రంలోని, దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి రైలు సౌకర్యాలు కలిగిన ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతికి డివిజన్ హోదా లేక పోవడం అన్యాయం. కేవలం 30 కి మీ వ్యత్యాసంతో గుంటూరు- విజయవాడ మద్య రెండు డివిజన్ లను చేయగా లేనిది తిరుపతికి ఇవ్వకపోవడం అన్యాయం కాక మరేమవుతుంది. అందుకే తిరుపతి కేంద్రం గా బాలాజీ రైల్వే డివిజన్ చేయడం సముచితం.
గుంతకల్లుకు జోన్ అవసరం.....
అర్హతలతో బాటు అవసరం కలిగిన ప్రాంతం గుంతకల్లు. రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాతం. అందులోనూ అనంతపురం అత్యంత వెనుకబడిన ప్రాంతం. నిరంతరం ఆత్మహత్యలు, బ్రతుకు కోసం వలసలు వెలుతున్న ప్రాంతం. మౌళిక వసతుల కల్పన జరగడం ద్వారానే సీమ ప్రాతం అన్ని విదాల అబివృద్దికి నోచుకుంటుంది. ఇప్పటికే శ్రీబాగా ఒప్పందానికి బిన్నంగా సీమలో ఉండాల్సిన రాజదానిని అమరావతికి మార్చారు. పోలవరం, స్టీల్ ప్లాంట్ తో సహ అనేక పరిశ్రమలు, తాజాగా పట్టిసీమ లాంటి నీటి ప్రాజెక్టులు ఒక ప్రాంతములోనే నిర్మించారు, నిర్మిస్తున్నారు. అన్ని విదాలా వెనుకబడిన సీమకు రైల్వేజోన్ కేటాయించడం సహజన్యాయం. జోన్ రాగలిగితే రాయలసీమ తో బాటు ఇతర ప్రాంతాలయిన కాలహస్ది-నడికుడి, కడప-బెంగుళూరు, దోర్నాల(శ్రీశైలం)-పుట్టపర్తి ప్రాంతాలకు రైల్వే నెట్ వర్క్ ను విస్దరించుకోవచ్చు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే విద్యూదీకరణ ను వేగవంతంగా పూర్ది చేసుకోవచ్చు. అంతేకాక తిరుపతి వాసుల చిరకాల కోరిక అయిన బాలాజి డివిజన్ సాదాన అత్యంత సులబతరం అవుతుంది. గుంతకల్లు జోన్ వలన వెనువెంటనే దాదాపు 10 వేల మంది మెరుగైన జీతాలు కలిగిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులు వస్దారు. పలితంగా మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాది కలుగుతుంది. గుంతకల్లు మున్సిపాలిటి త్వరితగతిన నగరంగా అబివృద్ది చెందుతుంది. తిరుపతి బాలాజి డివిజన్ అయితే మరో రెండువేల మంది ఉద్యోగులు తిరుపతి కేంద్రంగా ఉంటారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాడాలన్నా, ఐటి లాంటి సంస్దలు మనకు రావాలన్నా రైల్వే వ్యవస్ద మెరుగు పడటం అత్యంత కీలకం. అందుకే రాయలసీమ మేధావుల పోరం, రాయలసీమ షోషల్ మీడియా పోరం రాయలసీమలోని గుంతకల్లుకు జోన్, తిరుపతికి డివిజన్ ఏర్పాటు కావాల్సిన అవసరంపై ప్రజలలో చైతన్యం తీసుకు రావాడానికి పూనుకుంది.
విబజన చట్టంలో ఉన్నది విబజిత ఏపికి రైల్వే జోన్ ను కచ్చితంగా పరిసీలించాలని మాత్రమే. అంటే ఏపిలోని ఏదైయినా ఒక ప్రాంతములో జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. దురదృష్టవశాత్తూ రాజకీయ పార్టీలు తమ,తమ రాజకీయ అవసరాల కోసం చట్టంలో లేక పోయినా విశాఖ రైల్వే జోన్ అంటూ నామకరణం చేశారు. విశాఖ వాసులుగా అక్కడివారు జోన్ కోసం పోరాడితే తప్పులేదు. అక్కడి ప్రజలను అపార్దం చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా. కాని రాయలసీమలో ఉన్న నేతలు కూడా గుంతకల్లు జోన్ గురించి మాట్లాడక పోగా విశాఖ రైల్వేజోన్ అంటూ పోరాటానికి దిగడం సీమకు ద్రోహం చేయడం మినహ మరోటికాదు. రాష్ట్రానికి జోన్ అనికాకుండా విశాఖ కు జోన్ అని పోరాటం చేయడం ద్వారా కేంద్రం పై వత్తిడి పెంచే చర్య తప్ప మరోటికాదు.
ఇప్పటికే సీమకు నష్టం తెచ్చే పోరాటాలను సీమ ప్రజలతోనే చేయించన ఘనత మన రాజకీయ పార్టీలది. విజన చట్టంలోని సీమకు ప్రయోజనం కలిగే కడప ఉక్కు, గాలేరు నగరి, హంద్రీ నీవాకు నిదులు, సీమ ప్యాకేజికి రావాల్సిన 15 వేల కోట్లు గురించి సీమ ప్రజలను పోరాడామనాల్సింది పోయి సీమకు పెద్దగా ప్రయోజనం లేని హోదా కోసం పోరాటంలోకి దించుతున్నాయి. ఇప్పుడు ఏకంగా అన్నివిదాల జోన్ అవకాశం ఉన్న గుంతకల్లును పక్కన పెట్టి రాయలసీమ ప్రజల చేతనే విశాఖ జోన్ అని మాట్లాడిస్తున్నాయి మన పార్టీలు. అందుకే పార్టీల ఆటలో పావులగా మారకుండా మన సీమ సమగ్రాబివృద్దికి అత్యంత కీలకమైన గుంతకల్లు రైల్వే జోన్, తిరుపతికి బాలాజీ డివిజన్ సాదన కోసం ముందుకు రావాల్సిందిగా రాయలసీమ వాసులకు మనవి.